గ్రామ రాజ్యం ద్వారానే రామరాజ్యం
మోతుగూడెం,పెన్ పవర్
చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపిడీఓ వెంకటరత్నం హజరైనారు, ఈ సందర్భంగా అయినా మాట్లాడుతూ పంచాయతీ రాజ్ దినోత్సవం గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ అని. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారని,గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారని. ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీలకు వాస్తవమైన అధికారాలను అందిస్తే స్వావలంబన, స్వీయ చొరవను, సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర పాలనా యంత్రాంగంపై అధిక పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించడం. ఆలస్యాన్ని నివారించి ప్రజల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించేలా చేయడం. సేవల పరిమాణాలను పెంచడం, వికేంద్రీకరణ పంచాయతీరాజ్ ముఖ్య ద్యెయ్యాలని అన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంలో భాగంగా సచివాలయ ఆవరణలో మోతుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్నా పది మంది వాలంటీర్లకు సేవమిత్ర అవార్డులను అందించారు, ఈ సందర్భంగా వాలంటీర్లను ఘనంగా సన్మానిచ్చారు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి జ్యోతి, సర్పంచ్ ఆకేటి సీత, వార్డు సభ్యులు పార్వతి, రమాదేవి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment