ప్రతి ఒక్కరు కరోనా టీకా పై అవగాహన కలిగి ఉండాలి
జెడ్పీటీసీ మూల సునిత మురళీధర్ రెడ్డి
చిన్నగూడూరు, పెన్ పవర్
చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు ప్రతి ఒక్కరూ కారోనా టీకాపై అవగాహన కలిగి ఉండాలి అన్నారు. వైద్యాధికారి గుగులోతు రవి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ మూల సునితా మురళీధర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మూల మురళీధర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ మీర్జా మోసిన్ బేగ్ లకు కరొనా వ్యాక్సిన్ టీకాలను డాక్టర్ రవి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం లోని అన్ని గ్రామాల ప్రజలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేరి కరోనా వైరస్ నియంత్రణ కు టీకాలను వేయించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ పై ఎటువంటి అనుమానాలకు తావులేదని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పుల్లారావు, వైధ్య సిబ్బంది, స్టాప్ నర్సులు, నర్సులు, అంశాలు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment