Followers

రాగోలపల్లిలో సర్వేపల్లి వర్ధంతి

 రాగోలపల్లిలో సర్వేపల్లి వర్ధంతి

తాళ్లపూడి, పెన్ పవర్

 మాజీ రాష్ట్రపతి, భారతీయ తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి శనివారం రాగోలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించబడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు సర్వేపల్లి చిత్ర పటం వద్ద నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు దున్నా దుర్గారావు సర్వేపల్లి గురించి విద్యార్థులకు వివరిస్తూ...పేదరికంలో పుట్టి, చదువే లోకంగా భావించి, ఉన్నత చదువులు చదివి దేశ విదేశాల్లో అనేక ఉన్నత పదవులు నిర్వహించి భారత తొలి ఉప రాష్ట్రపతిగా , రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారని, భారతరత్న బిరుదు పొందారు అని వివరించారు. విద్యార్థులు కూడా సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయులు ఈతకోట సత్యనారాయణ, విద్యార్థులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...