శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న కె. కె.రాజు
విశాఖ ఉత్తరం, పెన్ పవర్
25 వార్డు లో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న కె.కె.రాజు
25 వ వార్డు సీతంపేట లో గల శ్రీ శ్రీ శ్రీ పార్వతీశ్వరాలయంలో సంపంగి సీను ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొన్నారు. ముందుగా సీతారాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో 25 వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవిందు,బి. గోవింద్, మరియు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
55 వ వార్డు లో శ్రీరామ నవమి వేడుకల్లో....
55 వ వార్డు గవర తాటిచెట్లపాలెం లో శ్రీ హనుమాన్ సీతారామ పంచాయతన ఆలయం లో జరిగిన శ్రీరామనవమి వేడుకలు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,గంగా మహేష్,చిన్న,కృపా మరియు ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
46 వార్డు లో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో....
46 వార్డు కైలాసపురం రోడ్డులో గల శాంతినగర్ లో శ్రీ రామాలయం లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొని స్వామి వారి కళ్యాణ వేడుకలు తిలకించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ కో-ఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు, చిన్న,రాఘవులు,కృప,మరియు గ్రామ పెద్దలు,ఆలయ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment