Followers

ఆస్తి కోసం సొంత కొడుకే తనపై పై హత్యాయత్నం

ఆస్తి కోసం సొంత కొడుకే తనపై పై హత్యాయత్నం

చిత్తూరు, పెన్ పవర్

ఆస్తి కోసం సొంత కొడుకే తనపై పై హత్యా యత్నానికి పాల్పడ్డారని బంగారుపాళ్యం  మండలం బిల్వమానుకి చెందిన 82 ఏళ్ళ వృద్ధురాలు కనకమ్మ వాపోయారు.చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన భర్త సుబ్బయ్య మొదటి భార్య పద్మావతమ్మ కు శివప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ అను కుమారులు సంతానం అని చెప్పారు. పద్మావతమ్మ అనారోగ్య కారణంగా చనిపోవడంతో తనను రెండో వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. తన భర్త బిడ్డలే తన సొంత బిడ్డలా భావించి పెంచి పెద్ద చేశారని పేర్కొన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ అతని భార్య మాటలు విని తనను పోషించకుండా నిరాదరణకు గురి చేశారని ఆరోపించారు. నా భర్త ఆస్తులను ఇద్దరు కుమారులు కు సమానంగా పెంచాలని కోరుతూ 2019లో కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. అయితే ఇప్పుడు రాజేంద్రప్రసాద్ ఇప్పుడు కేసు వాపసు తీసుకోవాలని తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, రాజేంద్రప్రసాద్ నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, జిల్లా ఎస్పీ స్పందించి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...