Followers

ప్రాణాలే పణంగా... ఆరోగ్య సిబ్బంది సేవలు

 ప్రాణాలే పణంగా... ఆరోగ్య సిబ్బంది సేవలు

కరోనా కట్టడికి ఆరోగ్య సిబ్బంది ఎనలేని సేవలు

వైద్య సిబ్బందికి ప్రజల అభినందనలు


చిన్నగూడూరు , పెన్  పవర్

చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత ఏడాది నుంచి నేటి వరకు కరోనా నివారణకు ఆరోగ్య  సిబ్బంది నిత్యం పనిచేస్తూనే ఉన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా బారిన పడిన వారికి మందుల పంపిణీ చేస్తూ సేవలందిస్తున్నారు. కరోనా బారినుండి బయటపడ్డామని ప్రజలు సంతోష పడుతున్న సమయంలోనే మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో కరోనా నివారణకు ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా సేవలు అందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కరోనా బారిన పడకుండా ఉచిత వ్యాక్సిన్  పంపిణీ కార్యక్రమం చేపట్టడంతో కనీసం తీరికలేకుండా పంపిణీ మందుల పంపిణీ , వ్యాక్సిన్ పంపిణీ వంటి సేవలు అందించాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందికి మరింత పెరిగింది. కరోనా వ్యాప్తి నివారణకు ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనివని మండలంలోని పలువురు కొనియాడుతున్నారు. బుధవారం రోజు 20  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4  పాజిటివ్ వచ్చినట్లు వారికి మందుల పంపిణీ చేసి వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి  వివరించినట్టు మండల వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు. ప్రజలు సహకరిస్తే ప్రజారోగ్యం... చిన్నగూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడం కోసం ప్రజలు ఎవ్వరికీ వారు చైతన్యవంతులు అయి సహకరిస్తేనే కరోనాను అరికట్టవచ్చని మండల వైద్యాధికారి డాక్టర్ రవి అన్నారు. భోజన సమయం లేకుండా విధులు... కరోనా సెకండ్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేపట్టడంతో ప్రజలు ఉదయాన్నే వ్యాక్సిన్ కోసం, పరీక్షలకోసం చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము భోజన సమయాన్ని సైతం వినియోగించుకోకుండా ఆరోగ్య సిబ్బంది అటెండర్ నుండి డాక్టర్ వరకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బాధితులకు  జాగ్రత్తలు చెబుతూ ఆత్మ ధైర్యాన్ని నింపుతున్నామని వైద్యాధికారి గూగుల్ లోతు రవి అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...