వైఎస్ఆర్సీపీ ఇంచార్జి సీనియర్ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
గాజువాక, పెన్ పవర్
జీవీఎంసీ పరిధి పెదగంట్యాడ గంగవరం గ్రామంలో ఈరోజు 64వ వార్డ్ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాస రావు పుట్టినరోజు సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం 76 వార్డు వైస్సార్సీపీ ఇంచార్జి సీనియర్ జిల్లా నాయకులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా గాజువాక వైయస్సార్ సిపి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ శిబిరం విశాఖ డైరీ కిమ్స్ ఐకాన్ సౌజన్యంతో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సహకారంతో నిర్వహించడమైనది. అనంతరం ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న సంకల్పంతో పనిచేస్తున్న76 వార్డ్ ఇంచార్జ్ దొడ్డి రమణను,ధర్మాల శ్రీనును అభినందించారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వంనుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అందేలా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 350 మందికి వైద్య సేవలు అందించడమే కాకుండా కంటికి సంబంధించి రెండు వంద మందికి వైద్య పరీక్షలు జరిపించి 55 మందిని ఆపరేషన్ నిమిత్తం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు. ధర్మాల శ్రీనివాస రావు మాట్లాడుతూ నా పుట్టిన రోజు సందర్భముగా ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసిన దొడ్డి రమణకు దేవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు .ఈ కార్యక్రమంలో 87వ వార్డు ఇంచార్జి కొమ్మటి శ్రీనివాసరావు,బి.సి. కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట అప్పారావు మాజీ కౌన్సిలర్ డి ఈ వి అప్పారావు.పి.పెంటయ్య, కె.గోపి,పి.నూకరాజు, కె.బాపణయ్య,డి.ఎల్.బి.నూకరాజు,సలీమ్,కె.అది, ఎన్.మంగరాజు,ఎం.అప్పారావు,బి.సోములు, సింగపూర్ రాజు,సత్తిబాబు,సిహెచ్. అప్పలరాజు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment