కోవిడ్ క్వారంటైన్ సెంటర్లను తక్షణమే ఏర్పాటు చేయాలి
అరకు, పెన్ పవర్
ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి ఏజెన్సీ ప్రాంతాలైన అరకు పార్లమెంట్ నియోజకవర్గం ప్రాంతపరిధిలో అధికారులు ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ శాసనసభ సభ్యులు స్థానిక నాయకులు సెకండ్ వెవ్ కరోనా ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, ఏపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ మరియు అరుకు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ పాచిపెంట శాంతకుమారి అన్నారు.కనీసం,,1) గ్రామస్థాయిలో కరోనా విజృంభణ నియంత్రణ జాగ్రత్త చర్యలు చేపట్టడంలో 2) సెకండ్ వేవ్ కరోనా పై ఆదివాసీ ప్రజల్లో అప్రమత్తం చేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో 3) ఏజెన్సీలో హోమ్ క్వారంటైన్ కిట్లు ఎన్95 మాస్కులు శానిటైజర్ లు 100% ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి సప్లై చేయడం లో 4) స్థానిక ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య నిపుణులు సంఖ్య పెంచడం లో 5) ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్లు ప్రతి మండల కేంద్రం గా ఏర్పాటు చేయడంలో 6) డోర్ టు డోర్ 100% అత్యధిక కరోనా టెస్ట్ లు చేయడంలో లో 7) ప్రతి గ్రామాలకు పారిశుద్ధ్య కార్యక్రమాలు బ్లీచింగ్ శానిటైజ్ కార్యక్రమాలు చేపట్టడంలో 8) బయట సిటీ లకు వలస కూలీలు గా వెళ్లిన ఆదివాసి ప్రజలకు వారి గ్రామాలకు చేర్పించడానికి తీసుకోవలసిన చర్యల విషయంలో 9) స్థానిక సాధారణ దగ్గు జలుబు విష జ్వరాలు వంటివాటిపై గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు వృద్ధులకు ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ తో వైద్యం మందులు అందించే విషయంలో 10) బాధ్యతాయుతంగా చిత్తశుద్ధితో సమర్థవంతంగా లాక్ డౌన్ అమలు చేసే విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఐటీడీఏ పార్లమెంట్ శాసనసభ సభ్యులు నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన చొ కచ్చితంగా చెప్పవచ్చుఅని అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఇప్పటివరకు ఎన్ని కోవిడ్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారో బహిర్గతం చేసి ప్రజలకి మనోధైర్యాన్ని కల్పించాలని ఇప్పటికైనా తక్షణమే ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పార్లమెంట్ శాసనసభ సభ్యులు ఎస్టీ కమీషన్,ఎస్టీ కార్పొరేషన్,గిరిజన సలహా మండలి,ప్రభుత్వం,అధికారులు,తక్షణమే స్పందించి బాధ్యత వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.ఆదివాసీ ప్రజలు ఈ సెకండ్ వేవ్ కరోనా పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
No comments:
Post a Comment