Followers

ఫోటోగ్రాఫర్ లను ప్రభుత్వం ఆదుకోవాలి

 ఫోటోగ్రాఫర్ లను ప్రభుత్వం ఆదుకోవాలి

కరోనా బారిన పడ్డ ఫోటోగ్రాఫర్లు త్వరగా కోలుకోవాలి

జిల్లానాయకులుచారి, నాగేంద్రప్రసాద్

నెల్లికుదురు, పెన్ పవర్

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఫోటోగ్రాఫర్ & వీడియో గ్రాఫర్ లను తెలంగాణ ప్రభుత్వంఆదుకోవాలని ఫోటోఅండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మోజు వెంకన్నచారి, ఉపాధ్యక్షులు సింగర౦ నాగేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు  మండలంలోని తారసింగ్ బావి వద్ద గల అబయాంజనేయ స్వామి గుడిలో ఇటీవల  కరోనా తో బాధ పడుతున్న ఫోటో గ్రాఫర్లు త్వరగా కోలుకోవాలని కొబ్బరికాయలు కొట్టిప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిత్యం ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ ప్రజా క్షేత్రంలో ఉంటూ ఈ విపత్కర సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కుటుంబ పోషణ భారంగా మారి తీవ్ర దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అన్ని వర్గాలను గుర్తించి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ లను కూడా గుర్తించిఆదుకోవాలనివేడుకున్నారు.అసోసియేషన్ మండలఅధ్యక్షుడు కడారి వెంకట రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్, నాయకులు ఈసంపెళ్లి ఉపేందర్, చదలయాకాంతం, అల్లిపాషా, గిరగాని యాకాంబరం, దబ్బెటనగేష్, శ్రీకాంత్, విశ్వ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...