పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్ ను ప్రారంభోత్సవం చేసిన ... విశాఖ జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు
విశాఖ తూర్పు, పెన్ పవర్
విశాఖపట్నం జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఐపిఎస్ పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు కొరకు ఆర్ముడు రిజర్వ్ కైలాసగిరి పోలీసు మైదానం దరి షాపింగ్ కాంప్లెక్స్ పైన నూతనంగా నిర్మించిన “రిటైర్డ్ పోలీసు అధికారుల రిక్రియేషన్ హల్” ను ప్రారంభోత్సవం చేశారు. 1983 సం లో సిటీ, రూరల్ గా పోలీసులు విడిపోయిన తర్వాత రూరల్ జిల్లాలో పదవీ విరమణ పొందిన పోలీసులకు రిక్రియేషన్ హల్ లేకపోవడంతో వారి అభ్యర్థన మేరకు జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని, 30 నుంచి 40 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకొని సాటి పోలీసులు కలిసి మెలిసి ఉండుటము వలన కుటుంబ సభ్యులుతో కన్నా తోటి ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల వారిలో ఎంతో ఆత్మీయ బంధం పెనవేసుకుంటుందన్నారు.
అటువంటి వారికి ఈ రిక్రియేషన్ హల్ స్వాంతన చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నూతనంగా నిర్మించిన రిక్రియేషన్ హాల్ లో కేరంస్, చేస్, న్యూస్ పేపర్లు మొదలైనవి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీరంతా పోలీస్ కుటుంబ సభ్యులేనని మీకు ఎటువంటి అవసరం వచ్చినా నేరుగా నన్ను కలవాలని అవసరమైతే మీ సేవలు కూడా పోలీస్ శాఖ ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే అర్మేడ్ రిజర్వ్ డి.ఎస్.పి., ఆర్.పి.ఎల్. శాంతికుమార్ వ్యక్తిగత శ్రద్ద కనబరిచి ఈ హాల్ ను నిర్మించడం అభినందనీయమని జిల్లా ఎస్.పి., అన్నారు.పదవి విరమణ పొందిన మొత్తం 50 మంది పోలీసు అధికారులు, తాము కొన్ని సంవత్సరాలుగా తమ కోర్కెను, తెలియజేస్తున్నామని,
కానీ ప్రస్తుత జిల్లా ఎస్పీ దృష్టికి ఈ విషయం తీసుకు వచ్చిన వెంటనే స్పందించి తక్కువ సమయంలో మేము కోరుకున్న రిక్రియేషన్ హాల్ ను నిర్మించి మాకు అందించడం చాలా ఆనందంగా ఉందని చెబుతూ జిల్లా ఎస్.పి. కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాహుల్ దేవ్ సింగ్ ఐపీఎస్ అదనపు ఎస్పీ ఎస్.ఈ.బి ఆర్.పి.ఎల్. శాంతికుమార్ డిఎస్పి ఎఆర్., జీ.వి.రమణ ఇన్స్పెక్టర్ డిఎస్బి. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, అరవింద్ కిషోర్, మురళీ మోహన్ రావు మరియు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment