Followers

కరోనా నిర్మూలన మన అందరి బాధ్యత

కరోనా నిర్మూలన మన అందరి బాధ్యత

కరోనా చికిత్సతో పాటు నివారణ పై దృష్టి సారించాలి
ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్
పాచిపెంట, పెన్ పవర్

కరోనాని సమిష్టిగా ఎదుర్కొందాం, కరోనా చికిత్సతో పాటు పూర్తి నివారణకు దృష్టి సారించాలి అని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. శనివారం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాచిపెంట మండలం పి.కొనవలసలో  ఏపీటీడబ్లూఆర్  స్కూల్ (బాయ్స్)లో  కోవిడ్ కేంద్రం ఏర్పాట్లను ప్రాజెక్ట్ అధికారి పరిశీలించారు.  కోవిడ్ కేంద్రంలో చికిత్స నిమిత్తం బెడ్స్ ఏర్పాటు, అవసరమైన మందులు, వైద్య సిబ్బంది తదితర అంశాలు పరిశీలించారు.  ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ కరోనా వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స అందించడంతో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టడం పై దృష్టి సారించాలని సంభందిత అధికారులకు సూచించారు. ప్రజల్లో ఈవ్యాది వ్యాప్తి చెందకుండా తగిన అవగాహన కల్పించి వారిని  అప్రమత్తం చేస్తే వ్యాది వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు అన్నారు. ఈ అవగాహన కల్పించడానికి సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ కుమార్, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...