Followers

మూడు పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు

 మూడు పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు 

పెన్ పవర్ వలేటివారిపాలెం

మండలంలోని చుండి,  లింగపాలెం,  కొండ సముద్రం  గ్రామాల్లో గురువారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు.  ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్ లు ఇరపని సతీష్, పారాబత్తిన కొండమ్మ, మన్నం వెంగమ్మ  మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి  పిలుపుమేరకు కరోనా సెకండ్ వేవ్  వైరస్ విజృంభిస్తున్నందున గ్రామాల్లో బ్లీచింగ్ హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించామని అన్నారు. 

అంతేకాకుండా ముందుగా నే  పారిశుద్ధ్యం పనులు చేపట్టినట్లు తెలిపారు. వీధుల్లోకి మురికి నీరు బయటకు రాకుండా, వీధులన్నీ  పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా వ్యాపిస్తుందని, కరోనా వ్యాధి ని అరికట్టుటకు పంచాయతీలోని వీధి వీధిలో  శానిటేషన్ చేస్తున్నామన్నారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి శానిటైజర్ ఉపయోగించి సామాజిక దూరం తప్పక పాటించాలన్నారు. చాలామంది ప్రజలు వ్యాక్సిన్ వల్ల   భయపడుతున్నారని, అలా  భయపడాల్సిన అవసరం లేదని 45  నిండిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...