Followers

నేడు ప్రపంచ పశు చికిత్స దినం.

 నేడు ప్రపంచ పశు చికిత్స దినం. 

 ఇంటి వద్దనే పశువులకు  వైద్యం. 

 పశు సంపదతో   క్షీర విప్లవం. 

మంచిర్యాల, పెన్ పవర్

ప్రపంచ  పశు చికిత్స దినం సందర్భంగా హాజీపూర్ మండలం పశువైద్యాధికారి నీ పెన్ పవర్ ప్రతినిధి ఫోన్ ద్వారా సంప్రదించగా డాక్టర్ శాంతి రేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి వద్దనే పశువులకు వైద్యం అందించాలనే లక్ష్యంతో  సంచార పశు వైద్యశాల 1962 వాహనం ను ఏర్పాటు చేశారని,  వీటి ద్వారా మండలంలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.  హాజీపూర్ మండలం లో ఏర్పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాల గురించి తెలియజేశారు.  మండలంలోని అన్ని గ్రామాలలో ఆవులకు,  పశువులకు చెవిట్యాగ్ మరియు గాలికుంటు టీకాలు వేశామని తెలియజేశారు.  అదేవిధంగా మేకలు గొర్రెలు కు పి పి ఆర్  వ్యాక్సిన్ 100% చేశామని చెప్పారు.  మండలంలో 29వేల మేకలకు గొర్రెలకు నట్టల మందులు పీపీ ఆర్ వ్యాక్సినేషన్ చేశామన్నారు ప్రస్తుతం మూడుసార్లు ఫ్రీగా నట్టల మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా మండలంలో 600 కేజీలు గడ్డి విత్తనాలు పంపిణీ చేశామన్నారు. మండలంలో  700 కుత్రిమ గర్భాధారణ టీకాలు  ఆవులకు, గేదెలకు వేశామని తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...