Followers

పర్యవేక్షణ లోపం

పర్యవేక్షణ లోపం


తాండూర్, పెన్ పవర్                                                                మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో  అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కరోనా టికా వేయిచుకోవడానికి వచ్చే వారు మరియు కరోనా టెస్ట్ కోసం వచ్చే వారు చాలా ఇబ్బందులు  పడుతున్నారు. ప్రస్తుత కరోనా  పరిస్థితులలో  నిత్యం ఈ ఆరోగ్య కేంద్రానికి  చాలామంది  వస్తున్నారు. ఇలా రావడంతో రద్దీ ఏర్పడుతుంది. ఈ  రద్దీతో  గుంపులు గుంపులుగా ఒకే చోట చేరడం వల్ల కరోనా మరింత ఉదృతమయ్యే అవకాశాలున్నాయి. దీనికి కారణం సరైన పర్యవేక్షణ లేక పోవడమే. కరోనా టెస్టుల కోసం వచ్చే వారికి సరైన సదుపాయాలు లేక చెట్ల కిందనే సేదతీరుతున్నారు. కొన్ని రోజుల కిందటే పెన్ పవర్ దీనికి సంభందించిన కధనాలను ప్రచురించినను ఆధికారులు ఎలాంటి  చర్యలు తీసుకోలేదు. అదే విధంగా  టికా వేయించుకోవడానికి వచ్చే వారికి రిజిస్ట్రేషన్ కోసం క్యూ లైన్ పాటించకపోవడం, అధికారులకు తెలిసిన వారు వచ్చినప్పుడు ముందుగా టీకా వేయించి పంపడం గొడవలకు దారి తీస్తుంది. టీకా కోసం  వచ్చే వారిలో చాలా మంది వయో వృద్దులే ఉండడం వల్ల అక్కడ లైన్ లో వారు ఎక్కువ సేపు వేచి  ఉండలేక పోవడం మరియు కరోనా తమకు ఎక్కడ సోకుతుందేమో అన్న భయం వారిలో కనపడుతుంది. గురువారం రోజున కరోనా టెస్టుల కోసం 30 మంది చేయించుకోగా 15 మందికి  పాజిటివ్,15 మందికి నెగిటివ్ గా  నిర్దారణ అయ్యింది. కనీసం ఇప్పటికైనా అధికారులు సరైన విధంగా పర్యవేక్షించి ఆరోగ్య కేంద్రానికి  వచ్చే వారి కోసం కనీస సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...