Followers

నగరంలో కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు

 నగరంలో కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు 

నగరంలో కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు 
సోడియం హైఫోక్లోరైట్ పిచికారి కోసం బృందాలు ఏర్పాటు 
 ఫిర్యాదులు, సలహాల కోసం నగరపాలక లో కాల్ సెంటర్ 08572 232745 
చిత్తూరు,  పెన్ పవర్


నగరంలో కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు నగర కమిషనర్ పి.విశ్వనాథ్ చెప్పారు. నగరంలో కోవిడ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రధానంగా నగరంలో సోడియం హైఫోక్లోరైట్ జంబో పిచికారి కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వార్డు నంబరు 1 నుంచి 10, 50,వార్డులకు సానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథం ఆధ్వర్యంలో వార్డు నంబర్ 1 నుంచి 19, 27,28,29 30,38,50 వరకు మేస్త్రి సాయి (88971 78746), శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, ప్రసాద్ ఆధ్వర్యంలో వార్డు నెంబర్ 20-26,31-37,39-49 మేస్త్రి హరి  (88971 70923)  పిచికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయా వార్డు సచివాలయ పరిధిలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో  వార్డు అడ్మిన్ కార్యదర్శి ఆధ్వర్యంలో... రెడ్ జోన్ ఏర్పాట్లను సంబదిత వార్డు ప్లానింగ్ కార్యదర్శి, బ్లీచింగ్ పక్రియను పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శి, క్వారంటైన్ నిబంధనల అమలు అంశాలను మహిళా పోలీసులు పర్యవేక్షిస్తారన్నారు. పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ నిర్వహణ, వారి ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య కార్యదర్శులు, వాలంటీర్లు నిత్యం పర్యవేక్షిస్తారని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీగా సంబంధిత అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్యులు ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తారని చెప్పారు. కోవిడ్ నిబంధనలు అమలు, హోమ్ ఐసోలేషన్, హోమ్  క్వారంటైన్లో ఉన్న వారి ఫిర్యాదులు సలహాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ 08572-232745 ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...