Followers

నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

 నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు 

 చిత్తూరు,  పెన్ పవర్

చిత్తూరు నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని నగర కమిషనర్ పి.విశ్వనాథ్ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సూపర్వైజరీ అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, నగరంలో కోవిడ్ ప్రోటోకాల్ అమలు అంశాలపై  టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా... వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు తగిన జాగ్రత్తలతో నియంత్రణ, సమన్వయ చర్యలు చేపట్టాలన్నారు. అధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసి బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.  నగరంలో వ్యాపారాలు మధ్యాహ్నం ఒంటిగంటకు స్వచ్ఛందంగా మూతపడుతున్న నేపథ్యంలో జనాలు గుంపులుగా లేకుండా పర్యవేక్షించారు. నగరంలోని ప్రధాన వీధులు, జన సమద్ద ప్రాంతాల్లో  క్రమం తప్పకుండా సోడియం హైఫోక్లోరైట్ పిచికారి చేయాలని, బ్లీచింగ్ చాలన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో వీలైనంత త్వరగా స్ప్రేయింగ్, బ్లీచింగ్  చేపట్టాలన్నారు. వార్డుల పరిధిలో కోవిడ్ ప్రోటోకాల్ అమల పక్రియను సూపర్వైజరీ అధికారులు, అడ్మిన్ కార్యదర్శులు నిత్యం పర్యవేక్షించాలి అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...