స్వీయ నియంత్రణ పాటించవలసిందే
పెన్ పవర్, ఆలమూరు
స్వీయ నియంత్రణ పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పెదపళ్ల పీహెచ్ సీ వైద్యులు టి భవానీశంకర్ అన్నారు. పెదపళ్ల పీహెచ్సీ సూపర్వైజర్ పీవీ రమణ పర్యవేక్షణలో గురువారం రెండవ దఫా (సెకండ్ డోస్) టీకాను ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించిన ప్రకారం మొదటి రోజు మూడు వందల మందికి టీకాలు వేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎఎన్ ఎం, అశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నారని కోవిడ్ వ్యాక్సిన్ పై చాలా మందికి అవగాహన అయ్యిందాని వ్యాక్సిన్ తీసుకోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు తెలుసుకున్నారని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని తెలియజేశారు.
No comments:
Post a Comment