హర్షం వ్యక్తం చేసిన గిరిజన నేత
నోడల్ ఏజన్సీ లో గిరిజన సంఘాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలిట్రైబల్ డెవలప్మెంట్ మిషన్(టిడియం) వర్కింగ్ ఛైర్మన్ ఓరుగంటి సుబ్బారావు
గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్
గిరిజన ప్రాంతాల్లో ఉండే చిన్నారులకు విద్యార్థి దశ నుంచే నైపుణ్యం పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్(టిడియం) వర్కింగ్ ఛైర్మన్ ఓరుగంటి సుబ్బారావు హర్షం ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ మేరకు అధికారులకు ఆదేశించడం గిరిజన చిన్నారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను తెలియపరుస్తుందన్నారు. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి శాఖ, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ ల ఆధ్వర్యంలో ఒక నోడల్ ఏజెన్సీ ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని, ఆ నోడల్ ఏజెన్సీ లో గిరిజన సంఘాల ప్రతినిధులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు. విద్యార్థులకు సాంకేతిక ఆ పరిజ్ఞానాన్ని అందించే నైపుణ్య వికాసం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్,ఐటీ తదితర అంశాలతో పాటు నైపుణ్య వికాసం గురించి ఇంపాక్ట్ స్టడీ చేసి ఆ నివేదిక ఆధారంగా తగిన కార్యాచరణను సిద్ధం చేసి గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించేందుకు గిరిజన, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్లోదయం కార్యక్రమాన్ని ని ప్రారంభించటం అభినందనీయమని అన్నారు. ఈ ఆంగ్లోదయం కార్యక్రమాన్ని రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్(టిడియం) వర్కింగ్ చైర్మన్ ఓరుగంటి సుబ్బారావు సూచించారు.
No comments:
Post a Comment