Followers

మరో సూపర్వైజర్ కి కోవిడ్ పాజిటివ్

 మరో సూపర్వైజర్ కి కోవిడ్ పాజిటివ్

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ మండలంలో ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ లో విధులు నిర్వహిస్తున్న ఐసిడిఎస్ సూపర్వైజర్ హైమావతి కి ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడంతో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇదే మండలంలో విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్ రమా కుమారికి తాజాగా పాజిటివ్ వచ్చినట్లు గజపతినగరం ఐసిడిఎస్ పిఓ సూర్య లక్ష్మి తెలిపారు. ఇద్దరు సూపర్వైజర్లు ఇటీవల మెంటాడ మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడి అభివృద్ధి కమిటీ సభ్యులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు అంగన్వాడి అభివృద్ధి కమిటీ సభ్యులను గుర్తించి వారికి కూడా టెస్ట్ లు, టీకాలు చేయిస్తామని గజపతినగరం  ఐ సి డి ఎస్ పి డి సూర్య లక్ష్మి విజ్ఞప్తి చేశారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు, చిన్నారులకు, తల్లులు, బాలింతలను గుర్తించి  వారికి కూడా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మెంటాడ లేదా గజపతినగరంలో కరోనా టెస్ట్ చేస్తామని ఆమె పెన్ పవర్ కు తెలిపారు. ఏ ఒక్కరూ  భయపడవలసిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కరోనా 1,2 టీకాలు తీసుకున్నారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగలేదని ఆమె పేర్కొన్నారు. ఇంకా కరోనా టీకాలు వేయించుకో లేని కార్యకర్తలను, ఆయా లను గుర్తించి వారికి కూడా కరోనా టీకాలు వేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతివారు తప్పకుండా మాస్కులు ధరించి బహుదూరం పాటించాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని    ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...