ఓటు వేయాలంటే బోటు దాటాల్సిందే...
పంచాయితీలు ఆవిర్భావం నుంచి ఇదే తంతుబోటు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న గిరిజనులు
ప్రభుత్వాలు మారినా గిరిజనులకు తప్పని బోటు ప్రయాణం
పెన్ పవర్, విశాఖపట్నం
ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో ప్రవహిస్తున్న మత్స్య గడ్డ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులు బాహ్య ప్రపంచం చూడాలంటే బోట్లే శరణ్యం. నిత్య అవసరాలు వైద్యం అందుకోవాలన్న మైళ్ళ దూరం గెడ్డ పై ప్రయాణించాల్సిందే. ఆదివాసి గిరిజనులు నివసిస్తున్న ప్రాంతంలో జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించడంతో మచ్చ గెడ్డ జలకళ సంతరించుకుంది. దీంతో ఆయా గిరిజన గ్రామాలు గెడ్డ పరివాహ కంగా మిగిలిపోయాయి. నాటి నుంచి గిరిజనులు ఏ చిన్న పని కైనా బోటు ఎక్కి తీరాల్సిందే. పండించిన పంటలు అమ్ముకోవాలి అన్న. తిని సరుకులు కొనుక్కోవాలన్నా అనారోగ్యంతో వైద్యం చేయించుకోవాలి అన్నా మత్స్య గెడ్డ పై బోట్ల సహాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడ అక్కడ రోడ్ల మార్గాలు ఉన్నప్పటికీ చుట్టూరా తిరగలేక గిరిజనులు గెడ్డ దారినే ఎంచుకుంటున్నారు. ముంచంగిపుట్టు మండలంలో పలు గిరిజన గ్రామాలు మత్స్య గడ్డ అవతలివైపు ఉన్నాయి. అక్కడి గిరిజనులు వారపు సంత లకు నిత్యావసరాలకు వైద్యం కోసం మండల కేంద్రానికి రావాల్సిందే. కుమ్మరి పుట్టు సుజనపేట నర్సిపుట్టు శంకిడి గొంది మల్లుడ పుట్టు బీట తాళపు తోట గొడ్డి పుట్టు తోటా పుట్టు తదితర గ్రామాల ఆదివాసీ గిరిజనులు బోట్లుపై ప్రయాణిస్తున్నారు. ఈ గ్రామాల గిరిజనులు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవడానికి గురువారం సుజన కోట పంచాయతీ కార్యాలయానికి బోట్ల సహాయంతో మచ్చ గెడ్డ దాటి వెళ్ళారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడి నుండి ఇక్కడే ఓట్లు వేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు. గతం లో బోటు ప్రమాదాలు కూడా జరిగాయని వారు గుర్తు.
No comments:
Post a Comment