Followers

సునీల్ నాయక్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

 సునీల్ నాయక్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : ఏబీవీపీ



కూకట్ పల్లి, పెన్ పవర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, తన చావుతో అయినా నిరుద్యోగుల దుస్థితి ప్రభుత్వానికి తెలిసొస్తుందని భావిస్తూ పురుగుల మందు తాగి మరణించిన కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సునీల్ నాయక్ మృతికి ముమ్మాటికీ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు కూకట్ పల్లి లోని జె.ఎన్.టి.యూ ప్రధానద్వారం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందూస్థానీ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష తొంభై వేల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ తెరాస ప్రభుత్వం నిర్లక్ష ధోరణితో వాటిని భర్తీ చేయకుండా కాలం వెల్లదిస్తుందని, నిరుద్యోగుల చావుకు కారణమవుతున్న కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారాల్సిన యువత పీనుగలై పాడేక్కుతున్నారని ఆయన విమర్శించారు. సునీల్ నాయక్ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష వైఖరే కారణమని, ఈఘటనపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. పరిపాలన చేతగాని అసమర్ధ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని రాష్ట్రపతికి, గవర్నర్ కు నివేదికలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా నిరసన నిర్వహించిన విద్యార్థులను కె.పి.హెచ్.బి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈకార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సనీల్, మురళీ, ఇతర నాయకులు రామకృష్ణ, సుధీర్, మనోజ్, గోపాల్, ప్రశాంత్, యశ్వంత్, మహేష్, జగన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...