Followers

నిషేధిత గుట్కా పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

 నిషేధిత గుట్కా పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిడికె వన్ టౌన్  సీఐ రమేష్ బాబు 

రామగుండం ,  పెన్ పవర్

గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్  గంగాధర రమేష్ బాబు ఆధ్వర్యంలో పలు చోట్ల నిషేధిత గుట్కా, పొగాకు విక్రయిస్తున్న దుకాణదారుల పై వన్ టౌన్ సిబ్బంది మెరుపు దాడి చేసి అక్రమంగా గుట్కా, పొగాకు ప్యాకెట్స్ ని విక్రయిస్తున్న రవి రాజు, తండ్రి మొగిలి, అడ్డగుంటపల్లి నివాసి, యండి అబ్బాస్ తండ్రి మహబూబ్, రాంనగర్ నివాసి, సర్దార్ అబ్దుల్ రజాక్ తండ్రి సర్దార్, జవహర్ నగర్ నివాసి, కొమ్ము నరేందర్ తండ్రి అంద్రయ్య, విఠల్ నగర్ నివాసి, పలువురి పై కేసులు నమోదు చేశారు. సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం గోదావరిఖని పట్టణంలో కొంత మంది దుకాణదారులు నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారనే  సమాచారం మేరకు సంబంధిత దుకాణాల పై తమ పోలీస్ సిబ్బందితో మెరుపు దాడులు చేసి వారి వద్ద నుండి 70,500/- రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్స్, పొగాకు ప్యాకెట్స్ స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో ఎవరైనా నిషేధిత వస్తువులను, మత్తు పదార్థాలను అమ్మితే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మెరుపు దాడులలో సీఐ లు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, కానిస్టేబుల్స్ ఏలీయా, శేఖర్, సదయ్య, హోంగార్డ్స్ తిరుపతి, మర్రి శ్రీనివాస్, రాజశేఖర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...