అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బేతి , కార్పొరేటర్ పన్నాల
తార్నాక , పెన్ పవర్
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లాపూర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉత్సవంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ డా.అంబేద్కర్ దార్శనికత మూలంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్దంగా సాధ్యమైందని తెలిపారు,సబ్బండ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్నదని గుర్తు చేసుకున్నారు,దళితుల కోసం 1000కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు, దళితుల అభివృద్ధికోసం వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రత్యేక ప్రగతినిధి ( ఎస్సీ సబ్ ప్లాన్) చట్టం ఏర్పాటు చేశామన్నారు,విద్యతో పాటు పలు అనుబంధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, అనుబంధ విభాగాల కార్యవర్గ సభ్యులు , పార్టీ శ్రేణులు పాల్గొన్నారు
No comments:
Post a Comment