Followers

ఆగిపోతున్న శ్వాసకి నీ రక్తంతో ఊపిరిపోయి నేస్తమా...!

 ఆగిపోతున్న శ్వాసకి నీ రక్తంతో ఊపిరిపోయి నేస్తమా...!

నేడు పట్టణంలో రక్తదాన శిబిరం

లక్షెట్టిపెట్, పెన్ పవర్

పట్టణంలో ఆదిత్య ఆసుపత్రి సహకారంతో అమృత వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు  ఆసుపత్రి నిర్వహికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే ఒకటవ నుండి 18సంవత్సరాలు పైబడిన అందరికి కరోన వ్యాక్సిన్ అందిచనున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రతీ ఒక్కరి అరవై రోజుల వరకు రక్తదానం చేయడానికి వీలుండదని, దీని కారణంగా బ్లడ్ బ్యాంక్ లలో రక్త నిలువలు తగ్గి ఎవరికైనా తలసేమియా ఇతర వ్యాధి గ్రస్థులకు రక్తం అందని పరిస్థితి ఏర్పడుతుందని, అలాంటి వల్ల ప్రాణాలు కాపాడడానికే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున ప్రతీ ఒక్కరూ రక్తదానం శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణాలు కాపాడలన్నారు. రక్తదానం చేసేవాళ్ళు ఉత్కూర్ చౌరస్తా లో ఉన్నటివంటి ఆదిత్య ఆసుపత్రి వద్దకు ఉదయం 9గంటల నుండి హాజరు కావాలని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...