భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ భర్త మృతి,భార్య చికిత్స
మెంటాడ మండలం, పోరం గ్రామానికి చెందిన పాలవలస అచ్యుతరావు ఆయన భార్య హైమావతి కి కరోనా పాజిటివ్ వచ్చింది. అచ్యుతరావు విశాఖపట్నంలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అచ్యుత రావు భార్య హైమావతి మెంటాడ మండలంలో ఐ సి డి ఎస్ సెక్టార్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతము హైమావతి కరోనా వైద్యాన్ని పొందుతున్నారు. అచ్యుతరావు మరణంతో పోరం గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి. హైమావతి ఇటీవల మెంటాడ మండల పరిషత్ కార్యాలయంలో మూడు రోజులపాటు అంగన్వాడి అభివృద్ధి కమిటీలకు శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంతలో హైమావతి కి పాజిటివ్ రావడంతో అభివృద్ధి కమిటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మండల, జిల్లా స్థాయి అధికారులు శిక్షణకు వచ్చిన అభివృద్ధి కమిటీ సభ్యులను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని పలువురు ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు కోరుతున్నారు. మృతుడు అచ్యుతరావు, హైమావతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
No comments:
Post a Comment