Followers

పత్రిక కార్యాలయాన్ని ప్రారంభించిన... చైర్మన్ చంద్రారెడ్డి

 పత్రిక కార్యాలయాన్ని ప్రారంభించిన... చైర్మన్ చంద్రారెడ్డి  

పెన్ పవర్ , కాప్రా 

పత్రికలు సమాజ శ్రేయస్సుకై పాటుపడుతూ, అనునిత్యం, ప్రజా సమస్యలపై ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడాలని నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి అన్నారు. గురువారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మాదిరెడ్డి మల్లారెడ్డి కాలనీలో పత్రిక కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమని నేడు సమాజంలో వృత్తిపరమైన ఎన్నో సమస్యలతో పోరాడుతూ కూడా నవ సమాజ స్థాపనకు పత్రికారంగం అహర్నిశలు కృషి  చేస్తుందని, ప్రజల మధ్య వారధిగా నిలుస్తూ సమాజ హితం కోసం పత్రిక,మీడియా రంగాలు కృషి చేస్తుందని, జర్నలిస్టులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేమని ఆయన అన్నారు. జర్నలిస్టులు లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేం . అనంతరం దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. తీవ్ర రూపం దాలుస్తుంన్నా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పత్రిక  రంగం తీవ్ర ఒడిదుడుకులు  ఎదుర్కొంటు ప్రజాహితం కోసం పాటు పడుతుందని,వార్త కథనాలతో సమాజాన్ని జాగృతం చేస్తూ ప్రజల గొంతుక  గుండెచప్పుడుగా నిలుస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్‌లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, అన్నంరాజు సుమిత్ర సురేష్,మోకు రేణుక జగన్మోహన్ రెడ్డి,కొమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి, కౌకుట్ల అనంత్ రెడ్డి, బుధ్ధవరం లక్ష్మి వేణు గోపాల్, దివ్య దయాకర్, కొత్త సురేఖ భాస్కర్ గౌడ్,కొత్త హేమలత శ్రీనివాస్ గౌడ్, నానునాయక్, మంగళపురి వెంకటేష్, సంపనబోల్ స్వప్న హరిగౌడ్, రామారం శ్రీహరిగౌడ్, వరగంటి వెంకటేష్, పాండాల అనురాధ యాదగిరి గౌడ్, వసుపతి రమేష్ గౌడ్,ఎస్.కె. షాదుల్లా, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, ఎంపిటిసిలు పండుగ కవిత శశికాంత్ ముదిరాజ్,  తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...