Followers

బాలల విద్య,ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయింపు కై మేయర్ కు విజ్ఞప్తి

బాలల విద్య,ఆరోగ్యానికి  అధిక నిధులు కేటాయింపు కై మేయర్ కు విజ్ఞప్తి

మహారాణి పేట, పెన్ పవర్

ఇటీవల జి.వి.ఎమ్.సి,2021:2022.బడ్జెట్ గాను 4255.35 కోట్లు గ నిర్ణయీంచారు.ఆరోగ్యానికి 516 విద్యకు 23 కోట్లు ఇచ్చారు.నగర జనాభా 20 లక్షలు బాలలు 40 శాతం  బాలల విద్యకు,ఆరోగ్యానికి ప్రాధాన్యత చెయూత ఇవ్వాలని మేయర్ కు బాల వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి నరవప్రకాస రావు  విజ్ఞప్తి  చేశారు.ఆదివారం మేయర్ క్యాంప్ కార్యాలయం లో అ మీను మర్యాద పూర్వకంగా కలసి పత్రాన్ని అంద జెసారు. నరవ ప్రకాశరావు సమస్యలను వివరిస్తూ నగరం లో స్కూల్స్ 147, చదువుతున్న విద్యార్థులు 24517, టీచర్స్ 912 మంది బాలల సంఖ్య కు తగ్గట్టుగా స్కూల్స్ లేవు.ఈ నేపథ్యంలో ఎంతమంది బాలలు ఎన్ని స్కూల్స్ కావాలీ అనే అంశం గురించి సర్వే నిర్వహించాలని కోరారు.ప్రతి విద్యర్దికి ఆరోగ్య కార్డు అందజెసి స్కూల్స్ లో అరొగ్య పరీక్షలు చేయాలి బాలలు బడి లో వుండే విదంగా భరోసా తో కూడిన హామీ ఇవ్వాలని కొత్త  స్కూల్స్ కట్టడానికి ప్రదాన్యత ఇవ్వాలని మేయర్ ను  కొరెరు.వచ్చే కౌన్సిల్ సమావేశం లో మాట్లాడు తామని అన్నారు.విజ్ఞాపన పత్రాల కాపీలను విద్య మంత్రికి  మరియు ముఖ్య మంత్రికి పంపడం జరిగింది అని నరవ ప్రకాష్ రావు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...