పరవాడ లో విజృంభిస్తున్న కరోనా
పరవాడ, పెన్ పవర్
పరవాడ గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న దృశ్యా సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ల నేతృత్వంలో పారిశుధ్య కార్మికులతో సోడియం హైపోక్లోరిడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.ఈ సందర్భంగా సిరిపురపు అప్పలనాయుడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో ,వీధుల్లో బ్లీచింగ్ పౌడర్,సోడియం హైపోక్లోరిడ్ ద్రావకాన్ని శానిటైజర్ తో కలిపి పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు.ప్రస్తుత పరిసితుల్లో ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యత వహిస్తూ ఇళ్లలోనే ఉండాలి అని అత్యవసర పరిస్తులోనే కరోనా రక్షణ కొరకు రెండు మాస్కులు ధరించి చేతులు సేనిటైజర్ తో శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటిస్తూ,బయటికి వెళ్ళిరావాలి అని కోరారు. ఎవరికివారే వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.గ్రామంలో కరోనా నివారణ కోసం గ్రామ ప్రజలంతా సహరించాలి అని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండారు రామారావు,వార్డు మెంబర్లు పయిల అప్పలనాయుడు, సిరిపురపు రాజేష్, పంచాయతీ కార్యదర్శి అచ్చుత రావు,రొంగలి అప్పారావు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment