Followers

జమిల్ బాషా మృతి టిడిపికి తీరనిలోటు

 జమిల్ బాషా మృతి  టిడిపికి తీరనిలోటు    

 నియోజకవర్గ  తేదేపా నాయకులు ఇంటూరి రాజేష్  
 ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు లోకేష్ 

పెన్ పవర్, కందుకూరు 

కందుకూరు నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్  వైస్ చైర్మన్ జమీల్ బాషా అకాల మరణం పార్టీకి తీరని లోటని నియోజకవర్గ తేదేపా నాయకులు ఇంటూరి రాజేష్ శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ జమిల్ బాషా ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను  వేడుకుంటున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ద్వారా జమీల్ బాషా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.  కందుకూరు పట్టణ తెదేపా సీనియర్ నేత, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జమిల్ బాషా ఇక లేరు అన్న వార్త మనసును కలచి వేసిందని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా బాషా కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. భాషా మృతి పార్టీకి తీరని లోటు విచారం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...