నత్త నడకన సాగుతున్న పునరావాస కాలనీల నిర్మాణం
కూనవరం, పెన్ పవర్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపు ప్రాంతాలను తరలించేందుకు నిర్మిస్తున్న పునరావాస కాలనీల నిర్మాణం పనులు కూనవరం మండలంలో నత్తనడకగా సాగుతున్నాయి. 41.5 కాంటురీ లో మొదటగా ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు అధికారులు భైరవపట్నం లో సుమారు 155 ఇండ్లునిర్మిస్తున్నారు. మూడు ఎండ్లే నుంచి నిర్మాణ పనులునత్తనడకన కొనసాగుతున్నాయి.వరరామచంద్రపురం మండలంలోని ప్రాజెక్ట్ వలన ముంపుకు గురవుతున్న జీడిగుప్ప, రాయగూడెం గ్రామాల గిరిజన కుటుంబాలు కోసం పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణం గానే పనుల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాగైతే నిర్వాసితుల పరిస్థితి రానున్న వర్షా కాలంలో ఆగమ్య గోచరంగా గానే కనిపిస్తుంది. గత ఏడాది ఆగస్టు నెలలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చడంతో రెండు సార్లు వరదలు సంబవించడం ముంపు గ్రామాల ప్రజలు బ్రాంతులకు గురియై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండవలసిన పరిస్థితి. గతంలో సంభవించిన వరదల వలన ముంపుకు గురైన గృహాలకు నేటికీ నష్ట పరిహారం చెల్లించలేదు. పునరావాస కాలనీల నిర్మాణం పనులు ఇలాగే కొనసాగితే రానున్న వరదల్లో ముంపు గ్రామాల పరిస్థితి ఏమిటి అని ఆందోళన చెందుతున్న ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పునరావాస కాలనీలు త్వరగా నిర్మించి, నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని గ్రామాలను త్వరగా ఖాళీ చేయించాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment