Followers

ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్లు

 ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్లు 

కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవల ను అందించుట పై ప్రత్యేక దృష్టి సారించండి
చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్లు,నోడల్ అధి కారులు సమన్వయంతో పని చేయండి
ఆక్సిజన్ కి, మందులకు ఎటువంటి కొరత లేదు   

చిత్తూరు, పెన్ పవర్

 చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు అంది స్తున్న వైద్య సేవలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి, సంక్షేమం) వి. వీరబ్రహ్మం, రాజ శేఖర్ లు శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి లో కోవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆసుపత్రి లో గల సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్(సంక్షేమం)రాజ శేఖర్ తో కలసి డి సి హెచ్ ఎ డా.సరళమ్మ, హాస్పిటల్ సూపరిం డెం ట్ డా.అరుణ్ కుమార్, ఆర్ ఎం ఓ  డా.సంధ్య, అపోలో అడ్మిన్ నరేష్,  ఆర్ ఎం ఓ రామ్ గోపాల్, సూపరిండెంట్ డాక్టర్ సుధాకర్ లతో చర్చించారు.

ఈ సందర్భంగా విలేకరులతో జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం మాట్లాడుతూ జిల్లా ప్రధాన ఆసు పత్రిలో బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సేవా దృక్ప థం తో పని చేయాలని తెలిపారు. డాక్టర్లు, నోడల్ అధికారులు సమన్వయం తో పని చేయాలని సూచించారు. ప్రధానంగా కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని కావున వైద్య సేవల నిమిత్తం వచ్చే బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందేలా పని చేయాలని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత లేదని నాలుగవ తరగతి సిబ్బందిని పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు..ఆక్సిజన్ కి,మందులకు ఎటువంటి ఇబ్బంది లేదని  తెలిపారు. కోవిడ్ బాధితులకు మంచి ఆహారాన్ని అంద జేయడం జరుగుతున్నదని, కోవిడ్ బాధితుల బంధువులకు తగిన సమాచారాన్ని అందించేందుకు  హెల్ప్డెస్క్ లో  సిబ్బంది ని పెంచి బాధితులకు సహకరించాలని  తెలిపారు. ఈ ఆసుపత్రిలో 530 కోవిడ్ బాధితుల కు కేటాయించడం జరిగిందని, ఇందులో 50 పడకలు ఐసియు, 260  నాన్ ఐసియు,220 నాన్ ఐసియు నాన్ ఆక్సిజన్ బెడ్స్ కలవని,ప్రస్తుతం 291 మంది  పేషెంట్లు   జిల్లా ప్రధాన ఆసుపత్రి లో వైద్య సేవలు పొందు తున్నారని డీసీహెచ్ ఎస్ జేసీ కి వివరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...