Followers

భారత దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు నిరుపమానం...

 భారత దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు నిరుపమానం...

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

భారత దేశ ఉప ప్రధాని గా, కేంద్రమంత్రిగా బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలు నిరుపమానమైనవని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం కొనియాడారు. సోమవారం స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బాబూ జగ్జీవన్ రామ్ 114 వ జయంతి  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామల ముందుగా ఏ ఎస్ డబ్ల్యూ ఓ పార్వతి, హెచ్ డబ్ల్యూ ఓ నాగమణి,విద్యార్థినిలు తో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులనుద్దేశించి సామల మాట్లాడుతూ  దేశ స్వాతంత్ర్య సమరయోధునిగా, భారత రిపబ్లిక్ మొట్ట మొదటి లోక్ సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా,దేశ ఉప ప్రధానిగా నాలుగు దశాబ్దాల పాటు దేశానికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం అసిస్టెంట్  సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బి పార్వతి, హెచ్ డబ్ల్యూ ఓ జె నాగమణి హాస్టల్ విద్యార్థినిలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...