Followers

కరోనా పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి

 కరోనా పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి

అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్


చిన్నగూడూరు, పెన్ పవర్

కరోనా పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం నాడుమహుబూబాబాద్ జిల్లా  చిన్నగూడూరు మండల కేంద్రంలోని పగిడిపల్లి , గుండం రాజు పల్లి, గ్రామాలలో కరోణ బాధిత కుటుంబాలను సందర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోన వచ్చిన వారు తమ ఇళ్లలోనే ఉంటూ వైద్యులు సూచనలను మరియు మందులను వాడాలని అన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని సమాచారం అందించాలన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీధులలో రావద్దు అని సూచించారు. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి అని కోరారు. వైద్య ఆరోగ్య సిబ్బంది కరోనా బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. మండలం లో కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో శానిటేషన్ పనులు సక్రమంగా లేవని మాస్కులు ధరించేలా అవగాహన అందించడం లేదని గ్రామ సర్పంచ్ కార్యదర్శి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు భరించాలని దండోరా వేయించి అవగాహన కల్పించాలని పంచాయతీ సిబ్బందికి సూచనలు చేశారు. పంచాయతీ సిబ్బంది నియామకంపై తనకు ఆరుసార్లు ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం ఆదేశం ప్రకారం కొండ్ర వెంకటమ్మ స్థానంలో తన వారసులను తిరిగి విధులలో కి తీసుకోవాలని కార్యదర్శి ఎంపీడీవో ను ఆదేశించారు. గ్రామ సభకు వార్డు సభ్యులు రావడంలేదని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కోమల, ఎంపీడీవో సరస్వతి, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, వైద్యాధికారి డాక్టర్ రవి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...