Followers

చర్లపల్లి లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం

 చర్లపల్లి లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం..

పెన్ పవర్, కాప్రా

చర్లపల్లి డివిజన్ పెద్ద చర్లపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రామ్మోహన్ డివిజన్ లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు.  అనంతరం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కాప్రా సర్కిల్ పర్యటనలో భాగంగా చర్లపల్లి వాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా కరోనా టీకాను తప్పకుండా వేయించుకోవాలని అన్నారు.  మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం శుభపరిణామం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బాల్ రెడ్డి, శివ కుమార్ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, విద్యా సాగర్, బత్తుల శ్రీకాంత్ యాదవ్,  కనకయ్య, చారి, రాజు, సబితా, లలిత,  హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్లు కౌశిక్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...