ముఖ్యమంత్రి వెంటనే అఖిలపక్షం వెయ్యాలి...
పెన్ పవర్, విజయనగరం
కరోనా ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం చేపడుతున్న నిర్దిష్టమైన చర్యలు జరుగుతున్న పరిణామాలు పై పూర్తిస్థాయిలో చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీల ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చెయ్యాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లోక్ సత్తా పార్టీ నుండి లేఖ రాశామని ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షల 84 వేలకు చేరిందని, కోవిడ్ మరణాల సంఖ్య దాదాపు 8 వేలకు చేరిపోయిందని, రాష్ట్రంలో లక్షా 20 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని మే నెలలో కరోనా ముప్పు భయంకరమైన స్థాయిలో ఉంటుందని ఐఐటి కాన్పూర్,హైదరాబాద్ శాస్తవ్రేత్తలు, మిచిగాన్ వర్సిటీ ప్రొఫైసర్లు ఇప్పటికే ప్రకటించారని వైరస్ చేస్తున్న భయంకరమైన విలయతాండవం కి ప్రజలు అల్లడిపోతున్నారని ముఖ్యంగా రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోకరోనా బాధితులకు పూర్తి స్థాయిలో అక్షిజన్ అందించే సమర్థత ప్రభుత్వం కి లేకపోవడంతో ప్రజలు పెద్దసంఖ్యలో చనిపోతున్నారని,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో ని అనుభవం ఉన్న వైద్యులు, ప్రజాసంఘాల తో సమావేశం నిర్వహించి ఉంటే బాగుండేదని, ప్రస్తుత పరిస్థితి ని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి అత్యంత వేగంగా రాజకీయ పార్టీల నేతలతో అఖిల పక్షం ఏర్పాటు చేయాలని భీశెట్టి డిమాండ్ చేశారు,రాష్ట్రంలో కరోనా మహా విధ్వంసం చేస్తుంటే ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ప్రతి నియోజకవర్గ స్థాయిలో సచివాలయ సిబ్బంది కి అవార్డు ల పేరుతో కలెక్టర్, ఎమ్మెల్యేలు జిల్లా అధికారులతో సదస్సులు నిర్వహిస్తున్నారని, మరోవైపు ప్రభుత్వం మూర్ఖంగా ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలు నిర్వహణకు సిద్ధమవడం అన్యాయమని పిల్లల తల్లిదండ్రుల మనో వేదన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్ధం చేసుకోవాలని భీశెట్టి కోరారు. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోరోగులకు అక్షిజన్ అందించే బెడ్లు, సాధారణ బెడ్లును వెంటనే పెంచకపోతే పెను ప్రమాదం తప్పదనే విష్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని భీశెట్టి కోరారు.
No comments:
Post a Comment