చిన్న రాష్ట్రాలు ఏర్పడితే దేశం బాగుంటుంది
అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే తెలంగాణ ఏర్పాటు : ఎమ్మెల్యే రామన్న
జైనథ్, పెన్ పవర్
భారత దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు నిర్దేశం బాగుంటుందని, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని చిన్న రాష్టల ఏర్పాటు ఆర్టికల్ వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాదించుకోగాలిగామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డిసిసిబి చైర్మన్ నాందేవ్ కాంబ్లే, తదితరులతో కలిసి నూతన అంబెద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపరచడం జరిగింది అని గుర్తు చేశారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకు ఉన్న విలువ తోనే ప్రపంచంలోనే అంబెద్కర్ గొప్ప వ్యక్తిగా ఎదిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి బోజా రెడ్డి, మార్కెట్ చైర్మన్ ప్రహ్లద్, జైనథ్ మండలం ఎంపీపీ మారిశెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, దళిత సంఘాల నాయకులు ప్రజ్ఞా కుమార్, మేకల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment