పలుకూరు లో సోడియం హైపోక్లోరైట్ పిచికారి
మండలం లోని పలుకూరు గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ వీరమల్లి శ్రీను ఆధ్వర్యంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి పిలుపుమేరకు కరోనా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు చేయమని ఆదేశించిన క్రమంలో గ్రామపంచాయతీలో కొలువుతీరిన నూతన సర్పంచులు అందరూ తమ తమ గ్రామాలలో కరోనా పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పలుకూరు గ్రామంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ద్రావణాన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో ప్రజలు తిరిగే ప్రదేశాల్లో ఈ ద్రావణాన్ని ట్రాక్టర్ ల సహాయంతో చల్లించారు. ఇటీవల గ్రామంలో కరోనాతో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అదే కాక గ్రామంలో ఇటీవల కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ వీరమల్లి శ్రీను ద్రావణాన్ని గ్రామంలో దగ్గర ఉండి మరీ చల్లిస్తున్నారు. గ్రామ ప్రజలు ఎవరూ కరోనా వైరస్ బారిన పడకుండా శానిటేషన్ చేయిస్తున్నారు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ వీరమల్లి శ్రీను ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న కార్యక్రమాల పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఏ ఎన్ ఎం కార్యకర్తలు, పున్నయ్య, బసవయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment