జుత్తాడలో జరిగిన మారణహోమానికి కారణమయిన దోషులను కఠినంగా శిక్షించాలి
మహారాణి పేట, పెన్ పవర్
పెందుర్తి జుత్తాడ విలేజ్ లో బొమ్మిడి విజయకుమార్ కుటుంబం పై దారుణ మారణ ఖాండ నిరసిస్తూ, మారణహోమానికి కారణమయిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తెలుగు యాదవ మహాసభ, విశాఖ జిల్లా అధ్యక్షులు నమ్మే అప్పలరాజు సారధ్యంలో గురువారం డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ఉదయం 10.00 గంటలకు వయా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆశిల్ మెట్ట మీదగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలి జరిగింది.అనంతరం జిల్లా కలెక్టర్ కి మరియు కమిషనర్ ఆఫ్ పోలిస్ విశాఖపట్నం వారికి కొన్ని డిమాండ్ లతో రిప్రజంటేషన్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోన గురవయ్య యాదవ్ మాట్లాడుతూ ఓరకంగా పచ్చగడ్డి చిన్నపిల్లల చూడకుండా నరమేధం సృష్టించిన అప్పలరాజు కు కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని బొమ్మిడి విజయ్ కుమార్ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇటువంటి సంఘటనలు జరిగే అన్ని సందర్భాల్లోనూ ప్రభుత్వం ఒకేలా ఉండాలని కొన్ని కులాల వారికీ ఒక న్యాయం అణగారిన వర్గాల లో ఉన్నటువంటి యాదవ జాతి కి ఒక్కక్క న్యాయమా అని ప్రభుత్వం న్ని ప్రశ్నించారు.ఈ దారుణ ఘటన తో సర్వం కోల్పోయిన బొమ్మిడి విజయ్ కుటుంబానికి తగినంత ఆర్థిక భరోసా కల్పించాలని అన్నారు. దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు కార్యక్రమం లో తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియం అశోక్ రత్నం యాదవ్,జిల్లా ప్రెసిడెంట్స్ నమ్మి అప్పలరాజు యాదవ్, నల్ల అప్పలరాజు యాదవ్,బొట్టా చిన్ని యాదవ్ కె.వెంకట రమణ యాదవ్,శేఖర్ యాదవ్,రామకృష్ణ యాదవ్,రాష్ట్ర లీగల్ అడ్వయిజరి కమిటి అధ్యక్షుడు గొలగాని అప్పారావు తదితరులు హాజరయ్యారు.
No comments:
Post a Comment