కరోన నిబంధనలు అమలు చేస్తున్న యస్ఐ జి.సతీష్
తాళ్లపూడి యస్ఐ జి.సతీష్ తాళ్లపూడి మండల పరిధిలోని గ్రామాల్లో కరోన సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోన నిబంధనలు సక్రమంగా అమలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా తాళ్లపూడి యువచైతన్య ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కొల్లి దుర్గారావు, యువశక్తి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కే. రజనీ కుమార్, ఇంకాకొంత ఆటో డ్రైవర్ లను ఎస్ఐ జి.సతీష్ పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. వారితో కరోన జాగ్రత్తలు గురించి వివరించారు. మాస్క్ లేనిదే ఎవరిని ఆటో ఎక్కించుకోరాదని, మీరు కూడా మాస్కు ధరించాలని తెలిపారు. అలా చేయని యెడల కఠిన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు.
No comments:
Post a Comment