సర్ఫేస్ డిపార్ట్మెంట్ లను ఎత్తివేసేందుకు యాజమాన్యం కుట్రలు
మందమర్రి, పెన్ పవర్
సింగరేణి వ్యాప్తంగా సర్ఫేస్ డిపార్ట్మెంట్ లను ఎత్తి వేసేందుకు సింగరేణి యాజమాన్యం కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే బెల్లంపల్లి లోని డిపార్ట్మెంట్ లను ఎత్తివేసేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని ఐఎన్టియుసి సీనియర్ ఉపాధ్యక్షులు సిద్ధంశెట్టి రాజమౌళి ఆరోపించారు. ఐఎన్టియుసి బాయిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మందమర్రి ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ లో నిర్వహించిన ద్వార సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియా వర్క్ షాప్ లో టెక్నీషియన్ లేక కార్మికులపై అధిక పని భారం పెడుతుందని, గతంలో 10మంది వెల్డర్ల తో చేసే పనిని ప్రస్తుతం ముగ్గురు వెల్డర్ల తో చేయిస్తున్నారని, ఎలక్ట్రిషన్, ఫిట్టర్ లను సరిపడా లేక బంకర్లు, ఫ్యూస్ ఆఫ్ కాల్ మరమ్మతులు నిలిచి పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ప్లేడే లు తగ్గించి, అధికారులకు అనుకూలమైన వ్యక్తులకు ప్లేడే లు కేటాయిస్తూ, సాధారణ కార్మికులకు ప్లేడే లు కేటాయించకుండా వారికి ఆర్ధికంగా నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. టెండల్ కొరత వలన పనిలో నైపుణ్యత తగ్గిందని, వెంటనే జనరల్ మజ్దూర్లుకు టెండల్ గా పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతున్న కారణంగా కార్మికులకు నాణ్యమైన మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి సింగరేణి కార్మికులకు పదవి విరమణ వయస్సు 61సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ, కార్మికుల పై పెరుగుతున్న పని భారనికి వ్యతిరేకంగా ఐఎన్టియుసి చేసే పోరాటానికి కార్మికులందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మేడే కార్మిక దినోత్సవం రోజున మందమర్రి బ్రాంచ్ కార్యాలయంలో జరుగు సమావేశానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమయ్య, కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంశెట్టి నరేందర్, వర్క్ షాప్ ఫిట్ కార్యదర్శి కళ్యాణ్, ఏరియా కార్యదర్శులు మండ భాస్కర్, దొరిశెట్టి చంద్రశేఖర్, వేణు నాయకులు కారుకూరి తిరుపతి, విక్రముద్దీన్, రాజేంద్ర ప్రసాద్, దోషాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment