కాంట్రాక్టర్ నిర్లక్ష్యం - ప్రయాణికులకు శాపం
పెద్దగూడూరు, పెన్ పవర్అంతా నా ఇష్టం అంటున్న కాంట్రాక్టర్ చిత్తం మీరెలా చెబితే అలానే అని తలూపుతున్న కొందరు అధికారులు గూడూరు చౌరస్తా రోడ్డు ను తవ్వి వదిలేసిన వైనం జాతీయ రహదారి నిర్మాణంలో కొరవడిన తనిఖీలు కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి కీ మెయిల్ ద్వారా పిర్యాదు చేసిన సమాచార హక్కు రక్షణ కమిటి మహబూబ బాద్ జిల్లా గూడూరు మండలంలోనీ 365 నంబరు జాతీయ రహదారి ఇది. రెండు సంవత్సరాలలో పూర్తి కావాల్సిన జాతీయ రహదారినీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వలన కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. నిత్యం వేలాది వాహనాలు వెళ్ళే రహదారి ఇది. గూడూరు పట్టణం నడి బొడ్డున ఇలా తవ్వి, మీ చావు మీరు చావండి అని వదిలేసాడు. గత ఇరవై రోజులుగా ప్రయాణికులు నరకం చవి చూస్తున్నారు. పెద్దాసుపత్రి, బ్యాంకు, బస్టాండు, కేసముద్రం రోడ్డు, భధ్రాచలం రోడ్డు, మహబూబబాద్ రోడ్డు, నెక్కొండ రోడ్డు వెళ్ళే ప్రధానమైన కూడలి లో తవ్వి వదిలేసాడు. నన్ను ఎవరు అడుగుతారు ? అడిగే ధైర్యం ఎవరికుంది అనే పొగరుతో కాంట్రాక్టర్ ప్రవర్తిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇరవై రోజులుగా అధికారులు నిద్ర పొతున్నారా ? లేదా కాంట్రాక్టర్ అడుగులకు మడుగులెత్తుతున్నారా ? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర ఆపదలో ఆదుకునే సంజీవని 108 వాహనం ట్రాఫిక్ లో నిలిచిపోయింది. కేవలం ఈ అసంపూర్తి రోడ్డు నిర్మాణం వలన. ఈ వ్వవహారంపై అధికారులు పట్టించుకోకపోవడంతో సమాచార హక్కు రక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు భూక్య మంగీలాల్ జాతీయ రోడ్డు రవాణా శాఖా మంత్రికీ ఈ మెయిల్ ద్వారా పిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఇప్పటికైన అధికారులు కళ్ళు తెరిచి, కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలనీ స్థానికులు,ప్రయాణికులు కోరుతున్నారు.
No comments:
Post a Comment