Followers

కులమతాలకు అతీతంగా ఆక్సిజన్ అందజేత

కులమతాలకు అతీతంగా ఆక్సిజన్ అందజేత...

 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్

ప్రశంసల జల్లు కురిపిస్తున్న జిల్లా ప్రజలు

ఆదిలాబాద్ , పెన్ పవర్ 

 కులమతాలకు అతీతంగా కరోనా బారిన పడ్డ రోగులకు ఉచితంగా ఆక్సిజన్ అందించడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో ఉచిత ఆక్సిజన్ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తన తండ్రి జ్ఞాపకార్థం ఏఎస్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. అధికారం లో ఉన్నటువంటి నాయకులు చేయని పని  సాజిద్ ఖాన్ కులమతాలు తేడా లేకుండా తన సొంత డబ్బులు వెచ్చించి ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేయడంతో జిల్లా ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గొప్ప మనసున్న మహారాజు అని జిల్లా ప్రజలు కొనియాడుతున్నారు.ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ కరోన కష్టకాలం లో ఆక్సీజన్ అందక  రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారి బాధలు చూడలేకనే తన తండ్రి జ్ఞాపకార్థం కరోనా రోగుల కోసం ఈ ఆక్సిజన్ పంపిణీ  కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఈ సేవల్ని  పొందొచ్చని తెలిపారు. ప్రజల కష్ట సుఖాల కోసం తాను ఎప్పుడూ మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, ముందు ఉంటానని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతినిత్యం శానిటైజర్, సోషల్ డిస్టెన్స్,మాస్కులు ధరించి కరోన ను తరిమికొట్టాలని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి  నేపథ్యంలో ప్రజలు  అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలి తప్ప అనవసరంగా బయట తిరిగి వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ ఆస్పత్రి చూస్తే  అధ్వానంగా తయారైంది అని  పాలకులు,సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే, కోవిడ్ పేషెంట్లకు సరైన సదుపాయాలు లేకనే,  వారికి సరైన ఈ సమయంలో ఆక్సిజన్ అందక కోవిడ్ రోగులు కోలుకోవడం లేదని, మరి కొందరు రోగులు చనిపోతున్నారని పేర్కొన్నారు.ఇకనైనా జిల్లా పాలక వర్గం నాయకులు, అధికారులు కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక చొరవ చూపి వారికి కావలసిన సదుపాయాలు కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అంజాద్ ఖాన్, జిల్లా  కాంగ్రెస్ నాయకులు మునిగెల నర్సింగ్,నగేష్, షకీల్, చంద్రాల రాహుల్, షేక్ కలీం,సంతోష్,రాజు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...