Followers

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యం

రాజమహేంద్రవరం, పెన్ పవర్

స్థానిక 7వ వార్డు కంచర్ల లైన్ గత కొంతకాలంగా ఇదే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి స్థానిక ప్రజలు  ఆవేదన తెలుపుతున్నారు .ఎనిమిది మంది కలిపి ఒక విద్యార్ధి ఇల్ల నాగేంద్ర పై మరణాయుదాలతో బ్లేడులతో దాడిచేసి తలను  పగలకొట్టారు.స్థానికులు చూసి అరవడంతో దుండగులు పారిపోయారు.బాధితుడికి చేతికున్న రెండు వేళ్ళు,తలపై గాయాలు కాగా అక్కడ స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అతనికి 20 కుట్లు పడ్డాయని ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదు చేసి అక్కడ వైద్యం జరుగుట కష్టం అని ప్రభుత్య ఆసుపత్రి సిబ్బంది తెలుపగ కాకినాడ ప్రభుత్య ఆసుపత్రికి తరలించాలి అని బాధితుడు కుటుంభానికి తెలుపగ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యానికి తీసుకెళ్లామని అక్కడ స్కానింగ్ పరీక్షలు చేస్తే గాని చెప్పలేము అంటూ, హైదరాబాద్ హాస్పటల్ కు తరలించామని బాధితుడు అమ్మ తెలియజేసారు.దవిలేశ్వరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు  చేసిన రెండు రోజుల తర్వాత మేము స్టేషన్ వెళ్లగా మా కేసులో ఉన్న  నిందితులలో ఇద్దరికి  స్టేషన్ బెయిల్ మంజూరు చేశామని పోలీస్ అధికారులు మాకు తెలిపారు.అదే నిందితులు మరల బెయిల్ మీద బయటకు వచ్చి మరొక వ్యక్తిని కొట్టడం, భయపెడుతూ గంజాయిని తన జోబులో పెట్టండి పోలీసులకు ఫోన్ చేసి అప్పచెప్పేదామని ఆ ఏరియా లో స్థానికుల ను భయభ్రాంతులకు గురిఅవడం,మహిళలు దగ్గర నగ్నం ప్రదర్శన చేయడం చెప్పలేని భూతులు,పదజాలం వాడుతూ,రోజు రోజు కి మాకు నరకయాతన మా ప్రాణాలకు రక్షణ లేదు అని, మాకు జరిగిన అన్యాయం మరొకరు జరగకూడదుఅని, ఎవరికి రాకూడదు అని వారు మీడియా వారికి  అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఆగడాలు జరుగుతున్నాయని అక్కడి స్థానికులు వాపోతున్నారు.మా ఏరియాలో జరుగుతూన్నా ఈ కార్యకలాపాలు మాకు మా కుటుంబాలకు వీరి నుండి మాకు పూర్తి రక్షణ కలిగించాలని,ప్రతి రోజు మా కాలనీలలో  పోలీస్ వారూ పర్యవేక్షణ లో భద్రత కల్పించాలని అక్కడ స్థానికులు    పోలీస్ వారిని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...