Followers

కుంభ రవిబాబు ప్రభుత్వానికి పెట్టుకున్న మైనింగ్ దరఖాస్తులు వెనక్కి తీసుకోవాలి

 కుంభ రవిబాబు ప్రభుత్వానికి పెట్టుకున్న మైనింగ్  దరఖాస్తులు వెనక్కి తీసుకోవాలి

పెన్ పవర్, విశాఖపట్నం

రాష్ట్ర  ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన కుంభా రవిబాబు ఇప్పటి వరకు అనేక మైనింగ్ అనుమతులు  కోసం దరఖాస్తు లు చేశారు. వాటిని వెనక్కి తీసుకుని ఆదివాసీ ప్రాంతాలలో పర్యటించాలని ఆదివాసీ జెఏసి డిమాండ్‌ చేస్తున్నారు.రాష్ట్రంలో  ఇప్పటివరకు, అధికారంలో ఉన్న అన్ని పార్టీలతో అంటకాగుతూ వచ్చినటువంటి కుంభ రవి బాబు అనంతగిరి  ఆదివాసి ప్రాంతంలో విలువైన   అన్ని మైనింగ్ ల కోసం దరఖాస్తులు చేయడం విడ్డురంగా ఉందన్నారు. అతని కి చిత్తశుద్ధి ఉంటే ధాఖలు చేసి న దరఖాస్తు లను వెనక్కి తీసుకోవాలన్నారు. ఆదివాసీ ప్రాంతంలో స్థానిక ఆదివాసులు బాక్సైట్ వ్యతిరేకిస్తూ ఆదివాసు లంత ఉద్యమాలు చేస్తుంటే  మైనింగ్ వ్యవహారాలకు కొమ్ము కాస్తు న్నటువంటి, కుంభ రవి బాబు ఈ ప్రాంతంలో పర్యటనకి వచ్చినప్పుడు  ఆ మైనింగ్ దరఖాస్తులనీ వెంటతేవాలన్నారు. అంతేకాకుండా ఎస్టీ కమిషన్ చైర్మన్ హోదాలో ఆదివాసీ ప్రాంతాల హక్కులకు, మైనింగ్ గాని మిగతా ఏ విధమైన హక్కులను భంగం కలిగిస్తే, హక్కులను భంగం కలిగించే  పరిస్థితులు వచ్చినట్లయితే, ఈ ఆదివాసి ప్రాంత ప్రజా ప్రతినిధులే దానికి సంపూర్ణ బాధ్యత వహించాలి. రేపు జరుగుతున్నటువంటి సన్మాన సభను కూడా మేము ఈ విధంగానే చూస్తాము. హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న కుంభా రవిబాబు కు ఇది ప్రోత్సహించే ఇటువంటి  పద్ధతుల్లోనే ఈ సన్మాన సభ నిర్వహిస్తున్నారు.ఇది నూటికి నూరుశాతం నిజం కనుక  దీనికి వారే బాధ్యత వహించాల్సి  ఉంటుంది .ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర,   జేఏసీ సలహాదారులు సోనియా గంగరాజు ,కో-కన్వీనర్ కూడా రాధాకృష్ణ, జవ్వాది సూర్యనారాయణ  ఆదివాసి జేఏసి లీగల్ అడ్వైజర్ ప్రసాద్ నాయుడు . బోంజునాయుడు , సుమన్, మాధవ్, తదితరులు పాల్గొనడం జరిగింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...