మెంటాడ లో ముమ్మరంగా క్లోరినేషన్
మెంటాడ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామంలో కూడా పలువురు కోవిడ్ బారినపడి పలువురు ఇళ్లల్లో వైద్య సేవలు పొందుతున్నారని ఆరోపణలు రావడంతో పంచాయితీ పాలకులు మొత్తం అన్ని వీధుల్లో తిరుగుతూ క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ గ్రామపంచాయతీ సర్పంచ్ రేగిడి రాంబాబు ఆదేశాల మేరకు శుక్రవారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రావు, గ్రామ వాలంటీర్లు, గ్రీన్ ఎంబర్స్ మెంట్ సీసీ డ్రైనేజీ, మురుగునీరు నిలవ ఉన్న చోట, బహిరంగ ప్రదేశాల్లో క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చెల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అవసరమైతే బయటికి రావాలి, ప్రతి ఒక్కరూ మార్పు ధరించాలని, మరీ ముఖ్యంగా ఎవరి ఇళ్లలో వారే లాక్ డౌన్ పాటించాలని, కరోనాపై అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు సలహాలు పాటించాలని సర్పంచ్ రేగిడి రాంబాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, గ్రామ వాలంటీర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment