ఆదిత్య యూత్ రెడ్ క్రాస్ యూనిట్ చే అడాప్ట్ ఎబౌల్ ఈవెంట్
పెన్ పవర్,గండేపల్లిగండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్యా ఇంజనీరింగ్ క్యాంపస్ వేసవి లో పక్షులను పరిరక్షించేందుగుకు ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ యూత్ రెడ్ క్రాస్ యూనిట్ చే అడాప్ట్ ఏ బౌల్ ఈవెంట్ ను చేపట్టినట్టు ఆదిత్య రెడ్ క్రాస్ యూనిట్ సభ్యులు తెలిపారు.వేసవి లో పక్షుల దాహాన్ని తీర్చేందుకు ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అడప్ట్ ఏ బౌల్ అన్నే ఈవెంట్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అందులో భాగంగా పక్షలకు క్యాంపస్ పరివాహక ప్రాంతం లో పర్యావరణానికి హానికరం కాని మట్టి తో చేసిన పాత్రలలో నీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం గా విద్యార్థుల సహకారం తో ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మేడలు పై నా మట్టి పాత్రలు ఉంచి వేసవి అంతా నీటిని అందించేందుకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎమ్. శ్రీనివాసరెడ్డి యూనిట్ సభ్యులను అభినందించారు.ఈకార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ ఎఫైర్స్.ప్రొ.జె.డి.వెంకటేష్, ఆదిత్య రెడ్ క్రాస్ యూనిట్ కో.ఆర్డినేటర్. ప్రొ.ఎస్.బి.జి.తిలక్ బాబు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment