Followers

ఫీల్డ్ అసిస్టెంట్ నాగేంద్రమణి మృతిపై ఉపాధి అధికారులు సంతాపం

 ఫీల్డ్ అసిస్టెంట్ నాగేంద్రమణి మృతిపై ఉపాధి అధికారులు సంతాపం 

సత్యవేడు, పెన్ పవర్ 

కరోనా బారిన పడి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రమణి ఆదివారం మృతి చెందడం పట్ల సత్యవేడు ఉపాధి సిబ్బంది తమ సంతాపం వ్యక్తం చేశారు .సోమవారం స్థానిక ఉపాధి కార్యాలయంలో ఉపాధి శ్రీకాళహస్తి క్లస్టర్ ఏపిడి ప్రేమ్ కుమార్ ,ఏపీఓ భాస్కరయ్య ఆధ్వర్యంలో ఉపాధి సిబ్బంది నాగేంద్రమణి మృతిపట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు .ఈ సందర్భంగా క్లస్టర్ ఏపీడి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి క్షేత్ర సహాయకులు కోవిడ్ నిబంధనలను పాటించాలి అన్నారు .తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం ,శానిటైజర్ వినియోగం తప్పనిసరి అన్నారు . అలాగే ఉపాధి పనులు జరిగే చోట కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు .కరోనా వ్యాధికి గురై చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నాగేంద్ర మణి మరణించడం దురదృష్టకరమన్నారు .కూలీలకు పనులు కల్పిస్తూ శ్రమశక్తి సంఘాల మధ్య ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కరోనా వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించాలని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరుతున్నారు .ఈ కార్యక్రమంలో ఉపాధి సాంకేతిక అధికారులు సుమలత ,శశిoధర్ , ఫీల్డ్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం ,నాగరాజు , భాస్కర్ ,కేజియా ,వరలక్ష్మి  ,ధనంజయుడు , అరుణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...