సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
తార్నాక, పెన్ పవర్.
రాష్ట్రంలోని రజక, నాయీబ్రా హ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలన్న సీఎం కేసీఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మల్లాపూర్ కు చెందిన రజక , నాయీబ్రాహ్మణులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న క్షౌర శాలలకు (కటింగ్ షాపులు), లాండ్రీలు, దోబీఘాట్లకు నెలకు 250 యూనిట్లవరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇస్తూ తక్షణం జీవో జారీకి చర్యలు తీసుకున్న సీఎం గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. అత్యంత బలహీనవర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, వారికోసం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పన్నాల దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో హమాలీ శ్రీనివాస్ , కుంటి కృష్ణ , సానాల రవి , ఎస్.వీ.శివ కుమార్ , పీఆర్ ప్రవీణ్ , నాయి బ్రాహ్మణా , రజక సంక్షేమ సంఘాల ప్రతినిధులు రాచమళ్ళ సత్తయ్య , నాగరాజు , విట్టల్ , నర్సింహులు , శ్రీనివాస్ , అశోక్ , రాజేందర్ ప్రసాద్, కిష్టయ్య , వెంకటరమణ , పరుశురాములు , రవి, రాహుల్ , సాగర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment