Followers

భీమిలి లో ఆకస్మిక పర్యటన చేసిన జి.వి.ఎం.సి, కమీషనర్ సృజన

 భీమిలి లో ఆకస్మిక పర్యటన చేసిన జి.వి.ఎం.సి, కమీషనర్ సృజన

భీమిలి, పెన్ పవర్

జివిఎంసి కమీషనర్ డా.సృజన భీమిలి జోన్ ఎగువపేట గ్రామంలో ఆకస్మిక పర్యటన చేసి  పారిశుధ్యం,మంచినీటివసతులు,కోవిడ్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వంటి విషయాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం మంచినీరు సమస్య ఎక్కువగా ఉందని అన్నారు.రోజూ కుళాయిలు వస్తున్నప్పటికీ ఒక కనెక్షన్ కి ఒక డ్రమ్ము కంటే నీరు ఎక్కువగా రావడం లేదని వాపోయారు.ఎండాకాలంలో అయితే రోజూ కుళాయిలు రావని,రోజు విడిచి రోజు ఇవ్వడం వలన అది కూడా తక్కువ నీరు రావడం చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు.ట్యాంక్ ల ద్వారా నీరు సప్లై చేస్తున్నప్పటికీ సరిపడా రావడం లేదని,  వర్షాకాలంలో అయితే బురద నీరు వస్తుందని వాపోయారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు జీవీఎంసీ కమీషనర్ కి ఇచ్చిన రిపోర్ట్ లో  పారిశుధ్య కార్మికులు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ  ఇంకా భీమిలి జోన్ లో పారిశుధ్యం లోపం కనిపిస్తుందని అన్నారు.భీమిలి జోన్ లో 4 వార్డులు ఉన్నాయని,జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇంకా 170  మంది పారిశుధ్య కార్మికులు ఈ జోన్ కి  అవసరం ఉంటుందని అన్నారు.

పారిశుధ్య కార్మికుల కొరత వలన వారు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మొత్తము ఏరియాని కవర్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.ఈ ఖాళీలను భర్తీ చేసినట్లయితే పరిశుభ్రమైన ప్రాంతంగా భీమిలి జోన్ ఉంటుందని గంటా నూకరాజు అన్నారు.దీనిపై  స్పందించిన కమీషనర్ మొత్తము  అన్ని జోన్లలో కూడా ఈ సమస్య ఉందని,త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.మహిళలు చెప్పిన మంచినీటి సమస్యను కూడా పరిష్కారం అయ్యేవిధంగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా కోవిడ్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.వైద్యులు, జోనల్ అధికారుల సూచనలు పాటిస్తూ మీరుకూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఎట్టి పరిస్థితిలో చెత్తను రోడ్డు పై  వేయొద్దని అన్నారు.పరిశుభ్రతను పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు.  ఈ  కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు,జోనల్ కమీషనర్ సిహెచ్.గోవిందరావు,శానిటరీ ఇన్స్పెక్టర్ మహాలక్ష్మి నాయుడు,మేస్ట్రీ రవి,సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...