Followers

తెరాస పార్టీ అంటేనే.! తెలంగాణ ప్రజల ఫ్యామిలీ.!

 తెరాస పార్టీ అంటేనే.! తెలంగాణ ప్రజల ఫ్యామిలీ.!

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన.! గులాభీ జెండా_తెరాస పార్టీ

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్


రామగుండం ,  పెన్ పవర్ 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన మహా నాయకులు సిఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం వరంగల్  మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 36వ, డివిజన్ లో ఎమ్మెల్యే చందర్ ఎన్నికలు ప్రచారం నిర్వహించిన ఆయన  అనంతరం టి.ఆర్.ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా టి.ఆర్.ఎస్ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఎళ్ల అలుపెరగని పోరాట ఫలితంగానే  స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక నుండి రాష్ట్రంలో 6-న్నర ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు  తీసుకువెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్ దని.. సిఎం గా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదోళ్ల కళ్లలో అనందం నింపుతున్నారని అన్నారు. 200 రూపాయల ఉన్న వృద్ధుల పెన్షన్ 2 వేలకు పెంచి వృద్ధులకు కెసిఆర్ ఆసరా గా కేసీఆర్ నిలుస్తున్నారని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలకు 2 వేల పెన్షన్ ఇస్తున్న ఘనత కెసిఆర్ దని ముస్లిం ల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని రంజాన్ పండగ సందర్భంగా ముస్లీంలకు రంజాన్ కానుక అందించడం జరుగుతుందని అన్నారు. పేదింటి ఆడబిడ్ధల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా వారి ఇంటి పెద్దన్న సిఎం కేసీఆర్‌ నిలుస్తున్నారని కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కీ పట్టం కట్టి సిఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలంటే 30న, జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ అభ్యర్థి రిజ్వానా మసుద్ ను మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జివిఎంసి 36వ, డివిజన్ ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...